ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలి – దర్శి సీఐ నాగమల్లేశ్వరరావు

తాళ్లూరు : గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలగకుండా శాంతియుత వాతావరనంలో పంచాయతీ ఎన్నికలు జరిగేం దుకు సహకరించాలని దర్శి సీఐ నాగమల్లేశ్వరరావు అన్నారు. మంగళ వారం సాయంత్రం మండలంలోని తూర్పుగంగవరం గ్రామ బస్టాండ్ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో
అన్ని పార్టీలకు చెందినవారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలన్నారు కార్యక్రమంలో ఎస్ఐ శింగంశెట్టి మల్లికార్జున కావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *