అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్.ఐదు ఐవీఎఫ్ కేంద్రాలకు నోటీసులుహైదరాబాద్‌

నవంబర్ 9,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
నిరుపేద మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్న వ్యవహారంపై మహిళా కమిషన్‌ తీవ్రంగాస్పందించింది. ఇందిరా, నర్మద, ఓయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ప్రధాన నిర్వాహకులు హాజరుకాకుండా సిబ్బందిని పంపడంపై కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద అసహనం వ్యక్తం చేశారు.హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కూడా విచారించిన కమిషన్‌ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత కేంద్రాల అనుమతులు తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. ఐదు కేంద్రాల నిర్వాహకుల నుంచి రాతపూర్వక వివరణలు తీసుకున్నామని, వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని శారద తెలిపారు. తదుపరి విచారణకు ప్రధాన నిర్వాహకులు మాత్రమే హాజరుకావాలని, సిబ్బందిని పంపితే సహించేది లేదని హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *