ప్యారడైజ్ ఎలెక్ట్రికల్ DE గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి. సురేష్….ఎమ్మెల్యే తలసానిని కలిసిన డీ ఈ సురేష్.

బేగంపేట నవంబర్
11(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎలెక్ట్రికల్ DE గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి. సురేష్ బుధవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను DE సురేష్ కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రజల మన్ననలు పొందే విధంగా మెరుగైన సేవలు అందించాలని నూతన DE కి సూచించారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ADE లు శివ దుర్గాప్రసాద్, వెంకటేష్ లు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*హై టెన్షన్ లైన్ సమస్యను పరిష్కరించాలి*

ఇండ్లపై నుండి వెళుతున్న HT విద్యుత్ లైన్ వైర్లతో ప్రమాదం ఉందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మోండా డివిజన్ లోని ఆదయ్య నగర్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. ఆదయ్య నగర్ కు చెందిన పలువురు బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ సమస్యను విన్నవించారు. ఇండ్ల పై నుండి వెళ్తున్న HT విద్యుత్ వైర్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, ఎలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. స్పందించిన ఆయన అక్కడే ఉన్న ఎలెక్ట్రికల్ DE సురేష్, ADE శివ దుర్గాప్రసాద్ లను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. HT విద్యుత్ లైన్ వలన కలుగుతున్న సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ఆదయ్య నగర్ వాసులు ప్రమోద్, నగేష్, కౌశిక్, ముక్తి, కన్నయ్య, వాజీద్, అజీజ్, జయశ్రీ, అజీమ్, మసూద్ తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *