తాళ్లూరు: నేలలో తేమ శాతం ఉపయోగించుకుని శీతాకాలంలోని మంచుతో మొక్కలు పెరుగుతాయని శనగ విత్తు సమయం ఇదే అని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు-2 రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ నెల దాటి విత్తినట్లయితే దిగుబడులు తగ్గుతాయని చెప్పారు. ఎకరానికి 40కేజీలు విత్తనం అవనమని, నవంబర్ నెల దాటి విత్తినట్లయితే మొతాదు పెంచాలని కోరారు. లావు – కాబూలి, జెజె–1, కాగ్-2 రకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతు సేవా కేంద్రాలలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకుని నగదు చెల్లించినట్లయితే నాలుగు ఐదు రోజులలో విత్తనం పొందవచ్చని చెప్పారు. విఏఏ సాయి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: