పంచాయితీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి.

తాళ్లూరు: పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో గ్రామ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని మండల ఆర్డీ దేవసహాయం, ఎంపీడీఓ, ఎఈఓఆర్ ఓ అజిత కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గ్రామ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. రెండవ దశలో మండలంలో పంచాయితీ ఎన్నికల జరగనున్నట్లు చెప్పారు. అందులో బాగంగా ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ వెడువడనున్నట్లు, 18న ఆర్టీ ద్వారా ఎన్నికల నోటిఫికేషన్, 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21 నామినేషన్ పరిశీలన, 22న తిరష్కరించిన నామినేషన్ల పరిశీలన, 23న అప్పీలు పై తీర్మానం, 24న అభ్యర్థుల ఉపసంహరణ, 29 ఓటింగ్ నిర్వహణ, రీపోలింగ్ ఉన్నట్లయితే 30న, 29నే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని ఆర్తీ వివరించారు. మండలంలోని ఐదు కేంద్రాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఉ న్నాయని చెప్పారు. ఆయా కేంద్రాలలో క్షేత్రస్థాయిలో అవనమైన అన్ని ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *