సిక్వాల్ భవన్ లో నిర్వహించిన అన్నకూట మహా ప్రసాద మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని………….

బేగంపేట నవంబర్ 17,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
సిక్వాల్ భవన్ లో నిర్వహించిన అన్నకూట మహా ప్రసాద మహోత్సవంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సోమవారం రాత్రి రాంగోపాల్ పేట డివిజన్ రంగ్రేజ్ బజార్ లోని సిక్వాల్ భవన్ లో నిర్వహించిన అన్నకూట మహా ప్రసాద మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఖాటు శ్యామ్ బాబా దర్బార్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అన్నప్రసాద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కె. కిషోర్, ఆంజనేయులు, గణేష్, అరుణ్ భట్, ఆనంద్ పాటిల్, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *