బన్సీ లాల్ పేట నవంబర్ 17,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా మంచి విద్యావంతులుగా తయారవ్వాలనేది నా లక్ష్యం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బన్సీలాల్ పేట డివిజన్ లోని భోలక్ పూర్ లో గల మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి తో ఉన్నత పాఠశాల గా గుర్తింపు లభించింది. దీంతో మంగళవారం పాఠశాల సిబ్బంది, అభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఆయన కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. నాడు మంత్రి హోదాలో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఫలితంగానే విశాలమైన స్థలంలో భవనాల నిర్మాణం, ప్రాథమిక పాఠశాల (ఫ్రై మరీ స్కూల్) స్థాయి నుండి ప్రాథమికోన్నత పాఠశాల (అప్పర్ ఫ్రై మరీ స్కూల్) గా అప్ గ్రేడ్ కాగా, ఇప్పుడు ఉన్నత పాఠశాల (హై స్కూల్) గా గుర్తింపు లభించిందని స్కూల్ ఆఫ్ గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ జారీ చేసిన జిఓ ప్రతిని వారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ స్కూల్ లో LKG నుండి 7 వ తరగతి వరకు విద్యాబోధన జరుగుతుండగా, 630 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇక నుండి 8,9,10 తరగతులకు కూడా విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా పేద, మధ్య తరగతి విద్యార్థులే విద్య నభ్యసిస్తారని, వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రయివేటు, కార్పొరేట్ స్కూల్ లలో చేర్పించే పరిస్థితులు లేవన్నారు. దానిని దృష్టి లో ఉంచుకుని అందుకు అవసరమైన చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం లో విద్యాబోధన జరగాలి, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని 3 కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేసినట్లు వివరించారు. పేద విద్యార్థులు మంచి విద్యావంతులుగా మారి గొప్ప ప్రయోజకులు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ముందు కూడా మేకలమండి పాఠశాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం లో తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఈ.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బి. నర్సింగ్ రావు, ఉపాధ్యక్షుడు ఆర్. రాజు, భరత్ భూషణ్, పూర్వ ప్రధానోపాధ్యాయుడు మల్లిఖార్జున్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు స్వరూప, పాఠశాల కు చెందిన పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: