తాళ్లూరు: పంచాయితీ పోరుకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైనది. మండలంలోని 16 పంచాయితీలకు ఐదు నామినేషన్ల కేంద్రాలలో నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. అందులో సర్పంచిలకు 22, వార్డు మెంబర్లకు 19 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ, ఈఆర్ ఓ పి అజిత తెలిపారు. అందులో దోసకాయల పాడు నామినేషన్ కేంద్రంలో సర్పంచికు రెండు, వార్డు మెంబర్లకు పది, నాగంబొట్ల పాలెం నామినేషన్ కేంద్రంలో నర్పంచికి 9 మంది, వార్డు మెంబర్లకు 11, తూర్పుగంగవరం నామినేషన్ కేంద్రంలో సర్పంచికు మూడు వార్డు మెంబర్లకు ఐదు, విఠలాపురం నామినేషన్ కేంద్రంలో సర్పంచికు రెండు, వార్డుమెంబర్లకు రెండు, తాళ్లూరు-1 నామినేషన్ కేంద్రంలో నర్పంచికు ఆరు, వార్డు మెంబర్లకు 21 చొప్పున నామినేషన్లు వచ్చాయి. తాళ్లూరులో నామినేషన్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సందర్శించారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. ఆమె వెంట ఎంపీడీఓ, ఈఆర్ అజిత, తహసీల్దార్ రమణా రావు, డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని ఫణీంద్ర, ఎంఈఓ జి సుబ్బయ్య, ఆస్ఐ సుధీర్ , సర్వేయర్ మహేష్‌లు, విఆర్‌లు ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: