లక్కవరం చిన చెరువు వేలం పాట నిర్వహణ – రూ. 30.11 లక్షలకు పాడుకున్న వేలం పాట దారుడు

తాళ్లూరు మండలం లో లక్కవరం మైనర్ ఇరిగేషన్ చిన చెరువులో మూడు సంవత్సరాల పాటు చేపలు వేసి పెంచుకోవటానికి పంచాయితీ ఆధ్వర్యంలో బుధవారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. సర్పంచి నన్నం వరలక్ష్మి, ఎంపీటీసీ రమణమ్మ, ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్నకుమార్, గ్రామకార్యదర్శి నూరుల్లాలు పాల్గొని వేలం పాటను నిర్వహించారు. వినుకొండకు చెందిన భీమనాథం శ్రీనివాసులు అధికంగా రూ. 30లక్షల పదకొండు వేలకు పాడుకుని హక్కును దక్కించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు తూము వెంకట సుబ్బా రెడ్డి, ఉప సర్పంచి పెద్దయ్య, లోకిరెడ్డి నరసింహా రెడ్డి, మేడగం వెంకటేశ్వర రెడ్డి, బొడ్డు హనుమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *