తాళ్లూరులో 11వ శబాబ్ధంలో వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న వినాయక స్వామి విగ్రహం గత ఎనిదేళ్ల వ్యవధిలో రెండు సార్లు దుండగులతో చొరీకి గురైనది. అతిపురాతన విగ్రహాలను దొంగలిస్తున్న ముఠా పనే అని అప్పట్లోనే తలచారు. అయితే సమీప పొలాల్లో వదిలివెళ్లటంతో తిరిగి దేవస్థానానికి రైతులు, భక్తులు చేర్చారు. అయితే 2023 జనవరి 7వ తేదిన మాత్రం మరలా ఇదే విగ్రహాన్ని మద్దిపాడు మండలం గుండ్లకమ్మ నది ఒడ్డుకు చేర్చి దుండగులు ధ్వంసం చేయటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు సార్లు క్షేమంగా దేవాలయానికి చేరిన విగ్రహం మూడోసారి ముక్కలు కావటంపై భక్తులు చర్చించుకుంటున్నారు. ఆయితే త్వరగా కేసును ఛేదించి, దుండగులను పట్టుకున్న పోలీస్ అధికారులకు, సిబ్బందిని ప్రజలు, భక్తులు ప్రసంశిస్తున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఇదే దూకుడును పోలీసులు ప్రదర్శించి పలు దొంగతనాలను కూడ ఛేదించి ప్రజల సొత్తును రికవరీ చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు.
