వర్మీ కంపోస్టు ఎరువుల పరిశీలన

గ్రామ పంచాయతీలలో సేకరించిన తడి పొడి చెత్త ద్వారా తయారుచేసిన వర్మి కంపోస్టు ఎరువులను ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారిని పద్మావతి పరిశీలించారు. మండలంలోని పెద ఉల్లగల్లు గ్రామంలో గల డంపింగ్ యార్డ్ ను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో ఇంటి పన్ను వసూళ్లకు వేగవంతం చేయాలన్నారు. నీటి తొట్లలో ఉన్న లార్వాను ,దోమ లేకుండా శుభ్రం చేసుకోవాలన్నారు. కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమంలో భాగంగా ఫ్రైడే డ్రై డే సందర్భంగా అంబాసిడర్లకు వర్మీ కంపోస్టు ఎరువుల తయారుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డంపింగ్ యార్డ్ లో ఉన్న నాలుగు నాడె పు తొట్లలో వర్మి కంపోస్టు ఎరువులు నిండిపోయాయని తెలియజేశారు. ఆ ఎరువులను విక్రయించి వాటి ద్వారా వచ్చిన నగదును పంచాయతీల అభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. ఇప్పటివరకు గ్రామంలో 95 శాతం మేర ఇంటి పనులు వసూలు చేశామని తెలిపారు. అనంతరం డంపింగ్ యార్డ్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనమాల నాగేంద్రం పిచ్చయ్య, ఈవోపీఆర్డి పి ఓబులేసు, పంచాయతీ కార్యదర్శి బి శ్రీనివాసరావు, కంప్యూటర్ ఆపరేటర్ మనోహర్, గ్రీన్ అంబాసిడర్ లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *