చివరి భూములకు నీరందించాలి – ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ – అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

దర్శి నియోజకవర్గంలోని ఎన్ఎస్పీ కెనాల్ ఆయక ట్టులో ఉన్న చివరి భూములకు కూడా సాగు నీరందించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో  శుక్రవారం ఎన్ఎస్పీ అధికారులతో ఆయన వీక్షించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ముండ్లమూరు మండలం పోలవరం ఉమామహేశ్వరపురం, మారెళ్ల, పూరిమెట్ల, శం కరాపురం గ్రామాల పరిధిలోని రైతులకు సాగు, తాగు నీరు అందించాలని ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నియోజవర్గంలోని
అన్నీ తాగునీటి చెరువులు నింపాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. కురి చేడు పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీ వాసుల సమ స్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఎస్ఈ లక్ష్మీరెడ్డి, డీఈలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే…*
అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతూ జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన అభిరాము ఎమ్మెల్యే  డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *