గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వందల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు అక్రమంగా పొందినందుకు కృతజ్ఞతగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై కుట్ర పూరితంగా విమర్శలు చేస్తున్నారని చినగానిపల్లె సర్పంచ్ పగడాల రమేష్ పై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. చినగానిపల్లె, వెనుతుర్లపాడు రెవెన్యూ గ్రామాల్లో పగడాల కుటుంబీకులు వందల ఎకరాల ప్రభుత్వ భూములు కొల్లగొట్టారని, వీరి భూ కబ్జాపై గతంలో కరపత్రాల పంపిణీ కూడా జరిగిందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగడాల కుటుంబీకుల భూ ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలవలేనని గ్రహించి ఎమ్మెల్యే రాంబాబు కాళ్ళు పట్టుకొని ఏకగ్రీవ సర్పంచ్ అయిన రమేష్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ముమ్మాటికీ నమ్మకద్రోహమేనని విస్తుపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్న భార్యకు ఏకగ్రీవ జడ్పీటీసీ, బావమరిదికి దేవస్థానం ఛైర్మన్ నామినేటెడ్ పదవులు పొంది టిడిపి కోవర్ట్ గా మారి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని గిద్దలూరు నియోజకవర్గం ప్రజలు మండిపడుతున్నారు. “వచ్చీరాని మాటలు రుచీ, ఊరీ ఊరని ఊరగాయ రుచీ” అన్న సామెతగా సొంత పంచాయతీలో ఒక్క భవనం కూడా కట్టకుండా అప్పులపాలు అయ్యామంటూ రమేష్ ప్రభుత్వంపై అపనిందలు వేయడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం సర్పంచుల సంఘంలో చేరి తాను వైసీపీ సర్పంచ్ ను అని చెప్పుకోవడానికి సిగ్గులేదా, వెంటనే సర్పంచి పదవికి రాజీనామా చెయ్యి అంటూ పగడాల రమేష్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టిడిపి కోవర్ట్ పగడాల రమేష్- గత ప్రభుత్వ హయాంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు స్వాహా-ఒకే కుటుంబానికి సర్పంచ్, జడ్పీటీసీ, ఛైర్మన్ ఏకగ్రీవ పదవులు కట్టబెట్టిన ఎమ్మెల్యే – రాజకీయ భవిష్యత్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలా అంటూ విస్తుపోతున్న గిద్దలూరు జనం
11
Apr