రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

ముండ్లమూరు మండలంలోని పెదవుల్లగల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్శి మండలం రాజంపల్లి కి చెందిన జేష్టది రామలక్ష్మి (20) దుర్మరణం పాలైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజంపల్లి కి చెందిన జైస్టాది రామలక్ష్మి తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై అద్దంకి వెళుతుండగా మార్గమధ్యంలో దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో ఉల్లగల్లు వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అదుపుతప్పి ద్విచక్ర వాహనం రోడ్డుపై పడడంతో తలకు బలంగా గాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకొని బోరున విలపించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ వి వెంకటేశ్వరరావు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *