ముండ్లమూరు వేసవిలో రోజురోజుకు ఎండ లు తీవ్రంగా ఉన్నందున వడదెబ్బలు తగిలే ప్రమాదం ఉందని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల నూజిల్ల పల్లి లోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నందు బుధవారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు , బాలింతలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతులు ఉదయం సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలన్నారు. ఎండలో పనులు చేసినట్లయితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని అన్నారు. సాధ్యమైనంత వరకు మీ వెంట కండువా గొడుగు ఉండాలన్నారు. అదేవిధంగా మీ వెంట మంచినీళ్లు తీసుకువెళ్లాలన్నారు. పొలాలలో ఎండలు ఉన్న సమయంలో చెట్లు కిందకు చేరి ఉపశమనం పొందాలన్నారు. 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు రక్తహీనత పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ శిబిరంలో 105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఎస్.కె హుస్సేన్ బి, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సిహెచ్ఓ కోడూరి శశి, ఏఎన్ఎం శారద, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
