సిఎస్ తో భేటీ అయిన ఎన్సిసి డైరెక్టర్ జనరల్ లెప్నెంట్ జనరల్ గుర్బిర్పాల్ సింగ్ – ఎపిలో ఎన్సిసి సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది- ఎపికి ప్రత్యేక ఎన్సిసి డైరెక్టరేట్ ఏర్పాటుకు తోడ్పాటు నివ్వాలి- ఎన్సిసి నిరంతర శిక్షణా కేంద్రానికి 10 ఎకరాలు స్థలం అవసరం

:దేశవ్యాప్తంగా జరిగే ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్సు రిక్రూట్మెంట్లలో రాష్ట్రం నుండి చేరే వారి సంఖ్య పెరగాలంటే ఎన్సిసి(నేషనల్ క్యాడెట్ కార్ప్స్)సేవలను రాష్ట్రంలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఎన్సిసి డైరెక్టర్ జనరల్ లెప్నెంట్ జనరల్ గుర్బిర్పాల్ సింగ్ (Gurbirpal Singh) (AVSM.VSM)బుధవారం వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాష్ట్రంలో ఎన్సిసి కార్యకలాపాల విస్తరణకు సంబంధించిన వివిధ అంశాలపై డైరెక్టర్ జనరల్ సిఎస్ తో చర్చించారు.ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్సిసి సేవలు తక్కువగా ఉన్నాయని వీటిని పూర్తి స్థాయిలో కళశాలలు,పాఠశాలల్లో పెద్దఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉందని సిఎస్ దృష్టికి తెచ్చారు.ప్రస్తుతం ఉన్న ఎన్సిసి సేవలను 60శాతం పైగా విస్తరించ గలిగితే ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్సు రిక్రూట్మెంట్లలో అధిక సంఖ్యలో అభ్యర్దులు ఎపి నుండి పాల్గొనేందుకు అవకాశం కలుగుతుందని ఆదిశగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డిని డెరెక్టర్ జనరల్ కోరారు.
అదే విధంగా ప్రస్తుతం ఎపి,తెలంగాణాకు కలిపి ఒకే ఎన్సిసి డైరక్టరేట్ ఉందని ఎపికి ప్రత్యేకంగా ఎన్సిసి డైరెక్టరేట్ ఏర్పాటు చేయదలిచామని అందుకు తగిన స్థలం ఇతర సహాయ సహాకారాలందించాలని సిఎస్ జవహర్ రెడ్డిని కోరగా అందుకు సిఎస్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు.అలాగే ఎన్సిసి కేడెట్లకు నిరంతర శిక్షణా కార్యక్రమాలకు ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటుకు 10 ఎకరాల స్థలం అవసరం ఉందని తెలపగా అందుకు కూడా సిఎస్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాష్ట్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రాలు,జిల్లా పోలీస్ పేరేడ్ మైదానాలను ఖాళీగా ఉన్న సమయంలో ఎన్సిసి సేవలకు ఉపయోగించేలా చూడాలని కోరగా సిఎస్.జవహర్ రెడ్డి స్పందించి దానిపై పోలీస్ శాఖకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.ఇంకా ఈభేటీలో ఎన్సిసి సేవల విస్తరణకు సంబంధించి పలు అంశాలపై వారు చర్చించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,ఆంధ్రప్రదేశ్- తెలంగాణా ఎన్సిసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ పి.మహేశ్వర్(వియం),కల్నల్ లు వివి.శ్రీనివాస్,వివేక్ షీల్,స్టాప్ ఆఫీషర్ లెప్నెంట్ కల్నల్ రుషిరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *