మార్కాపురం జన సముద్రం -భారీగా తరలివచ్చిన అభిమానులు- సీఎం సభ గ్రాండ్ సక్సెస్- సీఎం వరాలతో హర్షాతి రేఖము- జగన్ నినాదంతో మారుమోగిన పట్టణం

మార్కాపురం జనసంద్రంగా మారిపోయింది.
ఈబీసీ నేస్తం రెండో విడత ప్రారంభోత్సవానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయకుం తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ప్రకాశం వైఎస్సార్ సీపీ అడ్డా అని మరోమారు నిరూ పించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పట్టణ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో సభా ప్రాంగణానికి బయలు దేరారు. మున్సిపల్ కార్యాలయం, పాత బస్టాండ్ డోర్నాల సెంటర్, కాలేజి రోడ్డు మీదుగా డిగ్రీ కళాశాల ప్రాంగణం వరకు రోడ్లకు ఇరువైపులా వేలాది మంది ప్రజలు ఘనస్వాగతం పలికారు. కన్వాయ్ పై పూలు జల్లుతూ… జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ‘గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు దాక మార్కాపురం మండలంలోని శివారు గ్రామాలైన గొట్టిపడియ, గజ్జలకొండ గ్రామా లతో పాటు తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండ లాల్లోని అన్ని గ్రామాల నుంచి వైఎస్సార్ సీపీ అభిమానులు, మహిళలు సభాప్రాంగణానికి ఉదయం 9 గం లకే చేరుకున్నారు. సభాప్రాంగణం నిండిపోవడం తో ఎండలోనే పెద్దఎత్తున జనం బయటే ఉండి సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సీఎం వేదిక పైకి రాగానే ది. ఆయన ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. సభలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వరాల జల్లు కురిపించిన జగన్:
“నా తమ్ముడు నాగార్జునరెడ్డి అడిగిన కోరికలన్నీ తీరు స్తున్నాను. ఇప్పుడే కొన్ని పథకాలకు భూమి పూజ కూడా చేసి శిలఫలకాలను ఆవిష్కరించానని” సీఎం. జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దీంతో సభా ప్రాంగణం లో ప్రజలు జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 40 ఏళ్ల నుంచి పరిష్కారం కాని పొదిలి నీటి సమస్య పరిష్కారానికి రూ.50 కోట్లతో నీటి పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురానికి హర్షాతిరేకాలు కూడా నీటి సమస్య నివారణకు రూ.5 కోట్లు కేటాయించామని అన్నారు. మార్కాపురం పట్టణంలో పెండింగ్లో ఉన్న సమస్యను కూడా పరిష్కరిస్తు న్నానని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజికి సంబంధంచి ఐదుగురు రైతులకు ఒక్కొక్కరికి రూ. లక్షలు చొప్పున ల్యాండ్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నానని
ప్రకటించడంపై హర్షం వ్యక్తమైంది. పొదిలి మెయిన్ రోడ్డు డెవలప్మెంట్ కు సంబంధించి రూ.11 కోట్లు, లో అంబేడ్కర్ భవన్, బీసీ భవన్ కూడా నిధులు పొదిలి, మార్కాపురం నీటి సమస్యకు సీఎం పరి ష్కారం చూపడంతో మార్కాపురం, పొదిలి ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టును అక్టోబరులో ప్రారంభిస్తానని ప్రకటించడం తో జనం నుంచి పెద్ద హర్షాతిరేకలు వ్యక్తం అయ్యాయి.
సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ దగ్గర ఉండి ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే కెపీ నాగార్జునరెడ్డికి పలు సూచనలు చేశారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్ యాదవ్, టీజేఆర్ సుధాకర్ బాబు, కరణం బలరామ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెం కటరెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి,ఉడుముల శ్రీనివాసరెడ్డి, బాచిన చెంచు గరటయ్య, కదిరి బాబూరావు, శాస్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబు, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్ , రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణరెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, మంత్రి సురేష్ సోదరుడు సతీష్, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీ అలీబేగ్, వెన్నా హనుమా రెడ్డి, శిద్దా సుదీర్, మాదిగ కార్పొరేషన్ కె.కనకారావు మాదిగ, ఆర్యవైశ్య కార్పొ రేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు మేడా బద్రి, ఎన్ కొండయ్య, కేవీ రమణా రెడ్డి, బీసీ కార్పొరే షన్ డైరెక్టర్ జయలక్ష్మి, కమిషనర్ మల్లికార్జున, జెడ్పీటీసీ నారు బాపన్ రెడ్డి, ఎంపీపీ చెంచిరెడ్డి, తాళ్లూరు ఎంపీపీ , జడ్పిటిసి లు తాటికొండ శ్రీనివాసరావు, మారం వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ , ఎస్పీ మలికాగర్గ్, జాయింట్ కలెక్టర్ అభి షిక్తేకిషోర్ ,స్పెషల్ కలెక్టర్ సరళా వందనం, ఏర్పాట్లను పరివేక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లబ్దిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈబీసీ, పధకాన్ని తాము ఎలా ఉపయోగించుకుంటున్నది. లబ్దిదారులైన మహిళలు వివరించారు.

ఎమ్మెల్యే కేపీ కుటుంబ సభ్యులతో మాటామంతి..

మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిని పరామర్శిస్తున్న సీఎం వైఎస్ జగన్

హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులతో సీఎం వైఎస్ జగన్మో హన్ రెడ్డి సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే కెపీ కొండా రెడ్డి, సుబ్బమ్మ ల ను, ఎమ్మెల్యే సతీమణి కల్పన, సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డిలతో ప్రత్యేకంగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండా రెడ్డి ఆరోగ్య పరి స్థితిని అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *