సంక్షేమం ,రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొ న్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా ఆయన బుధవారం మండలంలోని గంగ దొనకొండలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయి, ఇంకా సమస్యలేమైనా ఉన్నా యా?అంటూ ప్రజలనడిగి తెలుసుకున్నారు. ప్రజ లంతా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాల గురించి చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. గతం లో ఏ ప్రభుత్వం కూడా సొంత గ్రామంలో సేవలు అందించలేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న లక్ష్యమన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రజల వద్దకు అధికారులు, నాయకులను ముఖ్యమంత్రి పంపుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ వివరించారు. వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ షేక్ సైదా, దర్శి
ఏఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, వైస్ చైర్మన్ కేసనపల్లి నాగేశ్వరరావు, మండల సచివాలయాల కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, కురిచేడు ఎంపీటీసీలు కానాల శివారెడ్డి, బుల్లం వెంకట నర్సయ్య, కురిచేడు, పడ మర గంగవరం సర్పంచ్ లు కేసనపల్లి కృష్ణయ్య, కాసు భాస్కరరెడ్డి, నాయకులు మేరువ పిచ్చిరెడ్డి, గండి సంతారావు, జ్యోతి అంకాలయ్య, యర్రగుంట్ల రోశయ్య, , కండె గంగయ్య, కర్నాటి వెంకటరెడ్డి, గోదల సుబ్బారెడ్డి, అందె సుబ్బారెడ్డి, వేమా వెంకటనారాయణ, వేమా శ్రీనివాసులు, వరికూటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


