వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యున్నతికి మరింతగా కృషి చెయ్యాలని రీజనల్ కోఆర్డినేటర్లు భూమా కరణాకర్ రెడ్డి, ఎంపీ బీద మస్తాన్
రావులు కోరారు. దర్శి ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో గురువారం నియోజక వర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం దర్శి ఎమ్మెల్మే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్లు తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు, ఒంగోలు పార్లమెంటరీపార్టీ అధ్యక్షడు జంకె వెంకట రెడ్డి, నియోజక వర్గ పరిశీలకులు, రాష్ట్ర దేవాంగులు కార్పోరేషన్ చైర్మన్ బి. సురేంద్రలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్లు తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ..ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ఆగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు గత సీఎంలతో పోలిస్తే ఎన్టీఆర్, వైఎస్సార్ తర్వాత అత్యంత ప్రజా దరణ పొందిన సీఎం వైఎస్ జగన్ ఒక్కడేనని ఉద్ఘాటించారు. ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు ఒంగోలు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకట రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించి ప్రజలు అభిమానాన్ని చూరగొన్న ఎకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏ గ్రామానికి వెళ్లిన, నివాసాలకు వెళ్లిన వారికి సీఎం వైఎస్ జగన్ హయాంలో జరుగుతున్న మెళ్లును తెలుపుతున్నారని అన్నారు. కార్యకర్తలు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుందని అన్నారు. మానమ్మకం నువ్వే జగనన్న, గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాలలో కార్యకర్తలు మన ప్రభుత్వ హయాంతో ప్రజలకు జరిగిన సంక్షేమాన్ని గుర్తు చేసి మరలా వారి మద్దతును కూడ గట్టాల్సిన బాధ్యతనువివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించారని, గడప గడపలో ప్రజలు అపూర్వ స్వాగతం అందుకు నిదర్శమని అన్నారు. మరలా ప్రజలు మద్దతు కూడ గట్టి 4లో మరలా సీఎం వైఎస్ జగన్ ను చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం నియోజక వర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులతో కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర, రాష్ట్ర గ్రినింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎఎంసీ చైర్మన్ వై. వి సుబ్బయ్య, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు ఎంపీపీలు సుధా అచ్చయ్య, ఎస్. ఎస్. బ్రహ్మానంద రెడ్డి, తాటికొండ శ్రీనివాసరావు, తాళ్లూరు, దొనకొండ జెడ్పీటీసీలు మారం వెంకట రెడ్డి, సుధాకర్ బాబు, మాండల పార్టీ అధ్యక్షుడు వెన్న పూస వెంకట రెడ్డి, వైస్ ఎంపిపిలు సోము దుర్గా రెడ్డి, ఐ వెంకటేశ్వర రెడ్డి, ఎంఎస్పి నాగార్జున రెడ్డి, హౌసింగ్ వేర్ కార్పోరేషన్ చైర్మన్ ఎంఎ ప్రసాద్ రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, జిల్లా ఎంపీటీసీ సంఘ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు జి. శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవ ప్రసాద్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ సైదా, కౌల్సిలర్లు వి. సి రెడ్డి, మోహన్ రెడ్డి, బాబు, జెసీఎస్ కన్వినర్లు ఎదురు కోటిరెడ్డి, బత్తిన వెంకటేశ్వర్లు, యాడిక శ్రీనివాస రెడ్డి, మేడికొండ జయంతి, సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, యర్రయ్య, అంబటి వెంకటేశ్వర రెడ్డి, రమణా రెడ్డి , జాన్, డగ్లస్, జాన్, అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.



