రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ చేయించి, నష్టం జరిగినప్పుడు వెనువెంటనే రైతులకు అందించి ఆదుకున్న ఘనత ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కు తుందని రాష్ట్ర పౌరసర ఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు అన్నారు…
శనివారం తణుకు పురపాలక సంఘం సమావేశ మందిరంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఇంబ్బందులు పడకూడదని ,పంట అంతా కోనుగోలు చెయ్యాలని , సకాలంలో డబ్బులు చెల్లించాలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మంత్రులకు,జిల్లా యంత్రాంగం కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని అయన అన్నారు. ఆన్లైన్ గాని ఆప్ లైన్లో గాని ధాన్యం కొనుగోలు చెయ్యాలని అధికారులకు ఆదేశించామన్నారు. గోనె సంచులు, వాహనాలు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అయన అన్నారు. ప్రభుత్వం తరపున ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ చేయించి నష్టం జరిగి నప్పుడు వెనువెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం దక్కుతుందని అయన అన్నారు.ప్రతి పక్ష నాయ కుడు అలోచన లేకుండా మాట్లాడు తున్నారని ఆయన పాలనలో రైతు లకు ఇన్పుట్ సబ్సిడీ గాని మరి ఇతర ప్రయోజనాలు కల్పించారా , ఈ రోజు ప్రతి పక్ష నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని అయన మాటలు ఎవ్వరూ నమ్మట లేదని ఆయన అన్నారు.రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనాలు కల్పించి,రైతు శ్రేయస్సు కోసం అను నిత్యం ముఖ్య మంత్రి ఆలోచనలు చేసి అనేక పథకాలు అమలు చేసి చూపిస్తున్నారని అయన అన్నారు. రైతుకు పంట నష్టం జరిగిన నెల లోనే ఇన్సూరెన్స్ అందించి రైతు లను ఆదుకుంటున్నామన్నారు. రోడ్లల పై ఉన్న ధాన్యాన్ని త్వరగా రైతు బరోసా కేంద్రాలకు తరలించి , మిగతా రైతులకు ధాన్యం అరబెట్టుటకు అవకాశం కల్పించు టకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. నాణ్యమైన ఎరువులు , పురుగు మందులు,సబ్సిడీతో ఆధునిక యంత్రాలు పంపిణీ చేసి రైతులకు ఎంత అవకాశం ఉంటే అంత ప్రయోజనాలు కల్పిస్తు న్నామని అయన అన్నారు.ప్రతి పక్షం ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నారని,మన ప్రభుత్వం పండుగ అని రైతులకు లాభ సాటి వ్యవసాయానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు అన్నారు.
కోసిన ధాన్యం కోసినట్లు మిల్లులకు తరలించేవిధంగా అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియో గదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరరావు అన్నారు…
శనివారం ఇరగవరం మండలం లోని పలుగ్రామాలలో పర్యటించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అకాల వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, వర్షాలవల్ల కోసిన ధాన్యం కోసినట్లు మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా నుండి 10 లక్షల గోనె సంచులు వస్తున్నాయని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే తరలించే విధంగా రైతులు ఆనందంగా ఉండే విధంగా చర్యలు తీసు కున్నామని అయన తెలిపారు. రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులకు మిల్లర్ల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు రైస్ మిల్లర్లకు సంబంధం లేదనే విషం తెలియక, ఇంకా రైతులు అపోహ పడుతు న్నారని అన్నారు. రైతులు ఆర్ బి కే లో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత అని, తర్వాత మిల్లర్లు పిలిచిన వెళ్లవలసిన అవసరం లేదన్నారు. కొంతమంది మిల్లర్లు రైతులకు ఫోన్ చేసి నూక అవుతుంది మిల్లుకు రావాలని పిలుస్తున్నారనే ఫిర్యాదు వస్తే అట్టి మిల్లులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు .అకాల వర్షంతో రైతుల వద్ద ఉన్న ధాన్యం ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. దళారీలు లేకుండా ప్రతి రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రైతు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర రూ 1530 రూపాయలు రైతుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు . రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు, మిల్లర్లకు దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకున్న చర్య అతి ముఖ్యమైనదని ఆయన అన్నారు.
దాన్యం తరలించేటప్పుడు రైతులు రవాణా చార్జీలు రైతు పెట్టుకున్నట్లైతే వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు అన్నారు. కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్ , స్థానిక నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
