ఒకప్పుడు వారందరూ ఒకే పాఠశాలలో కలిసి మెలసి చదువుకున్నారు. ప్రస్తుతం చదువు పూర్తి అయి వివిధ వృత్తులలో వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే ఆదివారం 24 సంవత్సరాల తర్వాత వారందరూ కొత్తపట్నం బీచ్లో కలుసుకుని పూర్వము తాము చదివిన బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తమ భవితకు పునాది వేసిన సంఘటనలను అందుకు కారణమైన గురువులకు గుర్తు చేసుకున్నారు. నాటి అల్లరి పనులు, మామ, ఓరే అంటూ చిన్న పిల్లల వలే ఆడుకున్నారు. నాడు గురువులైన రమణయ్య. అంజి రెడ్డి మాస్టర్లకు ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. నాటి విద్యార్థులు కెవీడి ప్రసాద్, తిరుపతయ్య, సుబ్బారావు నాయకత్వంలో 27 మంది విద్యార్థులు సమావేశమై మధుర స్మృతులను పంచుకున్నారు.
అ “పూర్వ’ కలయిక – రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్న బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు – నాటి గురువులకు సన్మానం
07
May