తాళ్లూరు మండలంలోని లక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బొల్లా చంద్రకళ (555) మార్కులు సాధించి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానంలో నిలిచి ప్రతిభ చాటినది. పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చి ఐదు విద్యాసంవత్సరాలు కాగా చంద్రకళ ఐదు విద్యాసంవత్సరాలలో విద్యార్థుల కంటే అత్యధిక మార్కులు సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు తెలిపారు. చంద్రకళ తోట వెంగన్న పాలెం గ్రామానికి చెందిన రైతు కూలీలు బొల్లా శ్రీనివాసరావు, సుజాత దంపతుల కుమార్తె. వీరికి ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా చంద్రకళ రెండవ కుమార్తె. వీరి గ్రామం నుండి ప్రతి రోజు ఆటోలో గ్రామానికి చెందిన 20 మంది లక్కవరం గ్రామానికి వచ్చి విద్యను అభ్యసిస్తుంటారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని ఎంఈఓ జి.
సుబ్బయ్య,ప్రధానోపాధ్యాయులుసుబ్బారావు,ఉపాధ్యాయులు అభినందించారు.
ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చంద్రకళ
07
May