తాళ్లూరు మండలం వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1984- 85వ విద్యాసంవత్సరంలో
పదవ తరగతి విద్యను అభ్యసించి నేడు వివిధ హోదాలలో ఉన్న పూర్వ విద్యార్థులు ఆదివారం సాయంత్రం గెట్ టు గేదర్లో కలుసుకున్నారు. 37 సంవత్సరాల తర్వాత కలుసుకుని పూర్వ విద్యార్థులైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్సైలతో పాటు వివిధ వృత్తులలో ఉన్న వారు చిన నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ ఉన్నతికి పాటు పడిన పాఠశాల అభివృద్ధికి తమ వంతు చేయూత ఇవ్వాల్సిన ఆవశ్యకతను చర్చించుకున్నారు.
37 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
08
May