తాళ్లూరు మండలంలో పి ఎల్ ప్రతినిధులు రైతు సమావేశం నిర్వహిణ – జై కిసాన్ యాప్ ఆవశ్యకతను వివరించిన ప్రతినిధులు

తాళ్లూరు మండలం కొత్తపాలెం మరియు మాధవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు ప్రముఖ పెర్టిలైజర్ కంపెనీ పి పి ఎల్ ప్రతినిధులు రైతు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వేసవికాలంలో పండించే పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిపిఎల్ కంపెనీ లభించే ఉత్పత్తుల గురించి తెలియజేశారు, రైతులకు సలహాలు సూచనల కొరకు జై కిసాన్ యాప్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించే విధానాన్ని తెలిపారు, మట్టి నమూనా పరీక్షను ఆవశ్యకతను వివరించారు ఈ సమావేశం రైతులకు ఎంతో ఉపయోగకరమైనది కంపెనీ ప్రతినిధులను రైతుల అభినందించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ పి. ప్రభాకర్ , జే ఏ లక్ష్మీదేవి, విలేజ్ అగ్రికల్ అసిస్టెంట్ సుధీర్ కుమార్, జెకెఎస్ ప్రసాద్, డి బి టి ఎస్ వెంకట్రావు, గ్రామ నాయకుడు నుసుము చిన్న ఆంజనేయ రెడ్డి రెండు గ్రామాల్లోని రైతులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *