ప్రజా ప్రతినిథులతో సమన్వయంతో పనిచెయ్యాలి – ప్రభుత్వంలో నవరత్నాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చాం – ప్రజా ప్రతినిథుల సహకారంతో రాబోవు రోజులలో వారి మద్దతు సమకూర్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎంగా చెయ్యాలి – ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు- మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ

అధికారులు అలక్ష్యం వీడి ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ …..మాట్లాడుతూ గ్రామాలలో ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇచ్చి ఆ గ్రామాలలో సమావేశాలు ఇతర అభివృద్ధి పనులు చేయ్యాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు లేనిదే ఆయా గ్రామాలలో ఎమి జరగన్న విషయాన్ని అధికారులు గుర్తు చేసుకోవాలని కోరారు. రామతీర్థం నీటి సరఫరా విషయంలో గ్రామకార్యదర్శులు నీటి సరఫరా అవుతున్నాదా లేదా అన్న విషయాలను పరిశీలించి సర్టిఫికేట్ మంజూరు చెయ్యాలని సూచించారు.
జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ …సీఎం వైఎస్ జగనన్న ఆధ్వర్యంలో నవరత్నాల అమలుతో ప్రతి నివాసంలో మేలు చేకూర్చామని రాబోవు రోజులలో ప్రజా ప్రతినిథుల సహకారంతో వారి మద్దతు కూడ గట్టి మరలా సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అధికారులు సక్రమంగా పనిచెయ్యాలని ప్రజా ప్రతినిథులను సరియైన ప్రధాన్యత ఇవ్వకుండా ప్రజా సమస్యలను తప్పుదారి పట్టిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. రూ.70లక్షల విలువైన రామతీర్థం నీటి సరఫరాలో తగిన సర్టిఫికేట్స్ తీసుకోకుండా బిల్లులు ఎలా మంజూరు చేస్తున్నారని ఆర్ డబ్ల్యుఎస్ ఎఈ శ్రీనివాసరావుని అడిగారు. శివరామపురం సెక్రటరీ నరేంద్రకు రికార్డులు ఎందుకు అప్పగించకుండా కాల
యాపన చేస్తున్నారని. అక్కడ ప్రజల సమస్యల పరిస్థితి ఏమిటని అన్నారు.
రామభద్రాపురం సర్పంచి వెంకట లక్ష్మి రామతీర్థం నీరు సరఫరా కావటం లేదని
నివాసాల మంజూరు సమాచారం ఇవ్వటం లేదని. కోఆప్షన్ కరిముల్లా డీప్ జోరు పనిచేయటం లేదని, ఎంపీటీసీ బాల కోటయ్య విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చెయ్యాలని, సర్పంచి మందా శ్యామ్సన్ పాఠశాలలో ఉపాధ్యాయులు సక్రమంగా పనిచెయ్యటం లేదని, తాళ్లూరు -2 ఎంపీటీసీ ప్రభుదాస్ వాటర్ ప్లాంట్ పనిచెయ్యటం లేదని సభ దృష్టికి తెచ్చారు. దోసకాయలపాడు సర్పంచి కోట శివలక్ష్మి పలువురి నియామకంలో తమకు సమాచారం ఉండటం లేదని, తురకపాలెం సర్పంచి గురువా రెడ్డి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు తమకు తెలిపటం లేదని ఇది సరియైన పద్ధతి కాదని అన్నారు. వైస్ ఎంపీపీ ప్రియాంక నాగార్జున రెడ్డి మాట్లాడుతూ… ప్రభత్వుం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరూ ప్రజలలోనికి తీసుకువెళ్లాలని కోరారు. ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ… ప్రజల వద్దకు సేవలు దగ్గరగా చేర్చేందుకు సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారని, ప్రతి సేవను సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్స్ వద్ద నమోదు. చేసుకుని రసీదు పొందాలని సూచించారు. శివరామపురం గ్రామకార్యదర్శికి రికార్డులు అప్పగించే విధంగా చర్య తీసుకుంటున్నట్లు చెప్పారు. వలంటీర్ల విషయంలో ఎంపీడీఓ బెదిరింపు ధోరణులకు దిగటం సరికాదని సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. తహసీల్దార్ రామ్మోహన్ రావు. పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఎఈ వీరబ్రహ్మం. ఎపీఓ మురళి. ఎపీఎం దేవరాజ్, వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బీ, వైద్యులు మౌనిక, శరీష్, ఎంఈఓ జి. సబ్బయ్య, సీడీపీఓ సీహెచ్ భారతి తమ శాఖలు పురోగతిని వివరించారు. అనంతరం హోమియో
వైద్యురాలు శిరీష ఆధ్వర్యంలో ఎండ వేడిమి నుండి ఉపశమనానికి హోమియో మాత్రలను, వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బీ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ కిట్స్ పాయింట్స్ ను ఎంపీపీ, జెడ్పీటీసీ, అధికారులు ప్రారంభించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *