పట్టుపరిశ్రమ రైతులకు సంవత్సరం పొడవునా మంచి రాబడి ఇస్తుందని జిల్లా పట్టుపరిశ్రమ అధికారి డాక్టర్ పి. సుజయకుమార్ అన్నారు. తాళ్లూరు రైతు భరోసాకేంద్రంలో శుక్రవారం పట్టు పరిశ్రమ శాఖ సాంకేతిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్సార్ పట్టుబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతితిగా పాల్గొన్న జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి పై సుజయకుమార్ చూట్లాడుతూ …నాణ్యమైన పట్టుగూళ్లు అధిక దిగుబడి సాధించేందుకు సాంకేతి పరిజ్ఞానం ఎంతో అవసరమని చెప్పారు. అందుకు తగిన సూచనలు,సలహాలను అందించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఫీల్ ఆఫీసర్ అంటోండి. విఏఏ నాగరాజు నాయక్. వెంకటరావు, సుధ తదితరులు పాల్గొన్నారు.
