కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 10, 11వ తేదీల్లో ఒంగోలు కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చేస్తున్నామని సెంటర్లు మూసి వేస్తున్నామని, మూకుమ్మడి సెలవులు అమలు చేయాలని దర్శి ఐసీడీఎస్ కార్యాలయంలో అసిస్టెంట్ సీడీపీఓ అంజమ్మ కి , సీఐటీయు, అంగన్వాడీ కార్యకర్తలు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ …అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు నుంచి తొలగించారని, 60 సంవత్సరాలు దాటిన వారిని రిటైర్మెంట్ చేసి ఖాళీ చేతులతో ఇంటికి శ్రీ పంపుతున్నారని అన్నారు. పలు సమస్యల పరిష్కారానికి జరిగే కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తిరుపతమ్మ, జయమ్మ, మేరి ప్రశాంతి కుమారి, సుజాత, పద్మ, బాలమ్మ, నాగమల్లేశ్వరి, ప్రశాంతి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
