ప్రజలు జగనన్న సురక్ష గ్రామ సభలను సద్వినియోగం చేసుకొని అవసరమైన సర్టిఫికెట్లు పొందాలని వక్తలు కోరారు. మాధవరం, తూర్పు గంగవ రంలో జగనన్న సురక్ష గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఈఓ ఆర్డీ కేజీఎస్ రాజు, డీటీ ఇమ్మానియేలు పాల్గొన్నారు.
తూర్పు గంగవరంలో…
సర్పంచ్ చాట్ల నాగమణి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల నాగమణి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అర్హులై ఉండి ధ్రువపత్రాలు లేక ఇబ్బందులు పడే వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నేడు జగనన్న ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలందరికీ పారదర్శకంగా సేవలందిస్తున్నారని అని అన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా అర్హతే ఆధారంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందివ్వాలని సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని ఆమె అన్నారు.

