విత్తనాల అనధికార అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు -ఏవో బి ప్రసాదరావు

రైతులకు అందించే విత్తనాలను అనధికార అమ్మకాలు సాగించినట్లయితే అలాంటి షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ సీడ్స్ షాపును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విత్తనాల బ్యాగులను, వాటి నిలువలను, వాటిపై ఉన్న కంపెనీ ముద్రలను, రైతులకు అమ్మిన రసీదులను ఆయన పరిశీలించారు. మొక్కజొన్న, సజ్జ తదితర విత్తనాలను సేకరించి తిరుపతిలోని రీజనల్ డీకోడింగ్ సెంటర్ కు పరీక్షల నిమిత్తం పంపారు. ఏఈఓ నాగరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *