జగనన్న సురక్ష కార్యక్రమంతో అన్ని వర్గాల ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు కలుగుతోందని మాజీ సొసైటీ అధ్యక్షుడు ఉపసర్పంచ్ పులి ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తాళ్లూరు మండలంలోని బొద్ధి కూరపాడు సచివాలయాల పరిధిలో మంగళ వారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమము నిర్వహించారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారథులతో ఇంటింటి సర్వే చేపట్టి అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాలను అందిండమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని సర్పంచ్ మందా శ్యాంసన్, ఎంపీటీసీ బాలకోటయ్యలు అన్నారు. అనంతరం గ్రామంలో అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలను అందించారు కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఇమ్మానియేల్ రాజు, ఈ.ఓ. ఆర్. డి కే జి ఎం రాజు, గ్రామ కార్యదర్శి షహనా బేగం తదితరులు పాల్గొన్నారు.
