మొక్కజొన్న సాగుచేసిన రైతులు నీటి యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని మండల వ్యవ సాయాధికారి ప్రసాదరావు తెలిపారు. మం డలంలోని విఠలాపురంలో క్షేత్ర పర్యటనలో భాగంగా మొక్కజొన్న పంటను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో 1093 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసి 3 నట్లు చెప్పారు. పైరుకు ఉదయం వేళ ఆకులు చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి అవసరం ఉన్నట్లు భావించి తడి ఇవ్వాలన్నారు. వర్షపాతం, నేలలు, పంట పరిస్థితులను బట్టి నీటితడులు ఇవ్వాలన్నారు. ఆయన వెంట వీఏఏ అశోక్, రైతులు పాల్గొన్నారు.
