జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ గా తూర్పు గంగవరంకు చెందిన సీనియర్ నాయకుడు కోసనా గురు బ్రహ్మం శనివారం బాధ్యతలు చేపట్టారు. కందుకూరు డివిజన్ దేవాదాయ శాఖ ఇన్సపెక్టర్ సత్యనారాయణ గుంటి గంగా భవాని ఆలయంలో శనివారం సమావేశం నిర్వహించి నూతన ధర్మకర్తల వివరాలను తెలిపారు. అనంతరం చైర్మన్ గా కొననా గురు బ్రహ్మం, ధర్మకర్తలు కొసనా కోటేశ్వరమ్మ, తిరుమల శెట్టి సత్యవతి, మాదనరు అంజమ్మ మొనపాటి జ్యోతి, ఆదిలక్ష్మి, గోళ్లపాటి యలమంద, పాల పర్తి కోటేశ్వరరావు, గుడిపాటి వెంకటరావులు, ప్రమాణ స్వీకారం చేసారు. ఎక్స్ అఫిషియో మెంబర్ గా పుచ్చకాయల విజయలక్ష్మిలు నియమితులైనారు. వీరి పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుందని తెలిపారు. తమకు అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్, తాళ్లూరు మండల వైఎస్సార్ సీపీ ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, స్థానిక ప్రజా ప్రతినిధులకు కృతఙ్ఞతలు తెలిపారు. అమ్మవారి సేవలో భక్తులకు కావలసిన సౌకర్యాల కల్పనలో అధికారులతో సమన్వయంతో పనిచేసే కృషిచేస్తానని చైర్మన్ కొసనా గురు బ్రహ్మం తెలిపారు.
పలువురు అభినందనలు…..
గుంటి గంగా భవాని చైర్మన్ గా ఎంపికయిన కొసనా గురు బ్రహ్మలను మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ యాడిక యలమందా రెడ్డి, ఉప సర్పంచి కాశి రెడ్డి, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం, ఎంఎల్ఓ, మల్లికార్జున రెడ్డి తదితరులు కాలువా కల్పి ఘనంగా సన్మానించారు. అభినందనలు తెలిపారు.







