సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలి -జిల్లా వనరుల కేంద్రం కోఆర్డినేటర్, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ కె.అన్న పూర్ణ

రైతులు సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించాలని జిల్లా వనరుల కేంద్రం కోఆర్డినేటర్, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ కె.అన్న పూర్ణ రైతులకు సూచించారు. కొండపి మండల కేంద్రం లోని గ్రామ సచివాలయం-1 రైతు భరోసా కేంద్రం పరిధిలోని మిరప, వరి, పొగాకు పంటలను మంగళవారం ఆమె పరిశీలించారు. పొగాకులో లద్దె పురుగును అదుపు చేయడానికి ఆముదం పంటను చేను చుట్టూ వేయాలని, మిర పలో తెల్లదోమ, తామర పురుగులను సమర్ధవంతంగా నివారించు టకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున పెట్టాలని తెగుళ్ల నివారణకు వాడే పురుగు మందులో వేప నూనె కలిపి తప్పనిసరిగా పంటపై పిచికారీ చేయాలని సూచించారు. వరిలో ఆకుచుట్టు పురుగు నివారణకు ఎసిఫేట్, క్లోరోఫైరిఫాస్ మందులో వేపనూనె కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. గట్ల మీద, మొక్కల సాళ్ల మధ్యలో కలుపు మొక్కలు తొలగించాలన్నారు. అగ్రికల్చర్ అసి స్టెంట్ టివి వెంకట నారాయణ, రైతులు ఆరికట్ల సాంబశివరావు, వేమ వరపు శ్రీనివాసరావు, కళ్లగుంట ఆంజనేయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *