ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అన్ని కాలాల్లో ప్రతి ఒక్కరూ చేయ వచ్చని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలి పారు. తాళ్లూరు మండలంలోని నాగం బొట్లపాలెంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ పంటలో ఆం తర్ పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంతి పూల సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎర్రబంతి, పసుపు బంతి ఉందన్నారు. మార్కెట్లో వాటికి డిమాండ్ ఉందన్నారు. తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే కషాయాలను వాడుకోవచ్చన్నారు. ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహులు, వీఏఏ శ్రీమ, ఐసీఆర్పీలు పాల్గొన్నారు
