పొగాకు నారు ట్రేలలో పెంచినవాటితో మంచి దిగుబడి, నాణ్యత ఉంటుందని ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ అన్నారు. మద్దిపాడు మండలం ఇనమన మెల్లూరు గ్రామంలో గురువారం పొగాకు సాగు చేయు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కోవి రామక్రిష్ణ మాట్లాడుతూ .. సరియైన వయస్సు కలిగిన నారు మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని, అదనంగా పురుగు మందులు వాడరాదని, దాని ప్రభావం పొగాకు పంటపై పడుతుందని అన్నారు. బ్యారన్ కు కేటాయించిన 3550కేజీల మేర మాత్రమే 4.75 ఎకరాలలో పంట పండించాలని చెప్పారు. నారు మడుల పెంపకం, పొగాకు నాట్లు, విడుపులు, ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, నీటి తడుల యాజమాన్యంలపై ఐటీసీ అధికారి యశ్వంత్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ వెంకటేశ్వర్లు, జీపీఐ రవి తదితరులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.
