శక్తి కేంద్రాల బలోపేతంతో బిజెపికి విజయావకాశాలు మెండు.ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువతో బిజెపి విజయం తధ్యం- తీగల సత్యవతి.

రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శక్తి కేంద్రాల బలోపేతం కోసం బిజెపి నాయకత్వం అవిరళ కృషి చేస్తూ ఉన్నది. నగరంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులను మరియు వారి కమిటీ సభ్యులను జాగృతం చేసే విధంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజానీకానికి తెలిసే విధంగా మరియు లబ్ధిదారులను గుర్తించి ఆయా పథకాలకు దరఖాస్తు చేసే విధంగా ఆయా పథకాల వివరాలను తెలుపుచూ మరియు ఎన్నికల నేపథ్యంలో ఓటు విలువ తెలిపే విధంగా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలను నిర్వహించేలా, ఓటర్ల జాబితాను పరిశీలించి ఓటు లేని వారిచే ఓటు కొరకు దరఖాస్తు చేయించడం, సవరణలు చేయించడం తదితర అంశాలను మండల అధ్యక్షులకు ఆ కమిటీకి తెలిపి కార్యోన్ముఖులను చేయడం, శక్తి కేంద్రాలకు జవసత్వాలు పెంచుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గురువారం స్థానిక చంద్రయ్య నగర్ లో భారతీయ జనతా పార్టీ మండల ఇంచార్జ్ తీగల సత్యవతి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు డబ్బుకొట్టు మనోజ్ అధ్యక్షతన పార్టీ అధినాయకులచే సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో భాజపా పార్లమెంటు కన్వీనర్ సెగ్గం శ్రీనివాసరావు, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, సుకన్య జిల్లా కన్వినర్ కంభంపాటి అంజనేయులు మరియు మిరియం శ్రీనివాసరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తీగల సత్యవతి మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పథకంలో పేర్కొన్న 18 రకాల వృత్తుల వారికి పథకాన్ని తెలిపి వారికి లబ్ధి చేకూరేలా దరఖాస్తు చేయించాలని అలాగే సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందేలా చూడాలని వివరించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఓటర్ల జాబితా అని పరిశీలించి అవసరమైన వారి పేర్లలో మరియు నివాస మార్పులు చేర్పులు దగ్గర ఉండి చేయించాలని పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *