చేసినవి చెప్పుకునే హక్కు మన ప్రభుత్వానికి ఉంది ఆక్వారంగానికి సీఎం వైఎస్ జగన్ ఊపిరి- ఆక్వాకల్చర్ యాక్ట్ మరింత ఉపయోగం- ఆక్వాకల్చర్కు విద్యుత్ సబ్సిడీతో ఎంతో మేలు- ఇన్సూరెన్స్తో మరింత మేలు – ఆక్వా రైతులకు ఇప్పటి వరకు చేకూర్చిన రూ. 2800 కోట్ల మేర లబ్ధి అప్పడా రాష్ట్ర వైస్ చైర్మన్ వి.రఘరామ్

ఆక్వా రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 ఆక్వాకల్చర్ డవలప్ మెంట్ అధారిటీని ఏర్పాటు చేసి విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతులకు ఊపిరి పోసారని ఆంద్రప్రదేశ్ కోస్టల్ ఆక్వా డవలప్మెంట్ ఆధారిటి (అప్పడా) రాష్ట్ర వైస్ చైర్మన్ వి. రఘరామ్ అన్నారు. డిఎల్డీఏ సమావేశపు మందిరంలో బుధవారం తిరుపతి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల రైతుల రోయ్యల రైతుల సదస్సు నిర్వహించారు. మత్యశాఖ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎడీ డాక్టర్ రంగనాథ్ బాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పడా రాష్ట్ర వైస్ చైర్మన్ వి. రఘరామ్ మాట్లాడుతూ… సీఎం వైస్ జగన్ విద్యుత్ సబ్సిడీ ఇవ్వటం వలనే ఇబ్బందులలో ఉన్న ఆక్వా మరలా సాగుకు సాధ్యమైనదని చెప్పారు. ఆక్వా రంగానికి రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ రూపంలో 2800 కోట్లు ఇవ్వటం జరిగినదని చెప్పారు. ఇంకా రైతులకు సంబంధించిన ప్రతి పనిని ప్రభుత్వం ద్వారా మేలు చేసామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయమని మేళ్లు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో లబ్ధిపొందామని చెసిన పనిని చెప్పుకునే హక్కు మన ప్రభుత్వానికి ఉందని అన్నారు. గత ప్రభుత్వాలు రూ.1.50 సబ్సిడీ ఎందుకు ఇవ్వలేదు. 26వేల కోట్ల ఎగుమతులు చేస్తుంటే ఎందుకు ఆక్వా యూనివర్సీటీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు అదుకునే ప్రభుత్వాన్ని చూడాలని అన్నారు. రాజకీయాలు వేరు రైతులు వేరు అని అన్నారు.
రైతుల కష్టం వేరు కన్నీరు వేరు అని అన్నారు. పబ్బం గడుపుకోవటాటానికి పలు రకాల మాటలు చెబుతారని అన్నారు. తాను నిత్యం మీమధ్యను ఉండి మీ కష్టాలు తెలుసుకుంటానని తెలిపారు. ఇటీవల ఆచంటలో మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆక్వాజోన్స్ జీవో సీఎం వైఎస్ జగన్ తెచ్చారని చెప్పటం హాస్యాస్పదమని చెప్పారు. జీవో తెచ్చినది నాడు చంద్రబాబు అని.. కాని నేడు ఆక్వా రైతులను మభ్యపెడుతున్నారని అన్నారు. తర్వాత ఆక్వా జోన్ను సీఎం వైħగన్ పెంచి రైతులకు మేలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసారు. రైతుకు మేలు చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని అన్నారు. ఆక్వా రైతుల సమస్యలపై తాను అవసరమైతే 24 గంటలు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందిస్తానని అన్నారు. ఇన్సూరెన్స్ కూడ కల్పిస్తూ కంపెనీలు ముందుకు రావటం మరింత మేలు చేకూరుతుందని అన్నారు. ఇండియా అసోషియేషన్ ప్రసిడెంట్ ఐపిఎల్ మోహన్ రాజు మాట్లాడుతూ గతంలో ఇన్సూరెన్స్ ఆక్వాకల్చర్కు కూడ ఉందని పలు వ్యాధులు అధిక సంఖ్యలో రావటంతో వాటిని తీసివేసారని, ప్రస్తుతం రెండు హెక్టార్ లోపు వారు ఇవ్వటం ఆక్వాకల్చర్ రైతులకు మేలు చేస్తుందని అన్నారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు గోపి నాథ్ మాట్లాడుతూ సంఘరాష్ట్ర అధ్యక్షుడు. అప్పడా రాష్ట్ర వైస్ చైర్మన్ వి. రఘరామ్ ఆధ్వర్యంలో ప్రభుత్వంలో అనేక మేలు జరిగిన విషయం వాస్తవమని, ప్రస్తుత పథకం ఇన్సూరెన్స్ కూడ పంటల పథకం వలే ఉచితంగా నమోదు అయ్యే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. చెన్నై సెంట్రల్ ఇన్స్ట్సిట్యిట్యూట్ ఆఫ్ బ్యాకిష్ వాటర్ ఆక్వా కల్చర్ సైంటిస్ట్ సీవీ సాయిరామ్, రైతు సంఘం బాధ్యులు మున్నంగి రాజశేఖర్, జిల్లా మత్యశాఖ అధికారి ఆవులం చంద్రశేఖర్ రెడ్డి, బాపట్ల జిల్లా అధికారి సురేష్, నెల్లూరు ఎడీ రంగనాథ్ బాబు, శ్రీనివాస్, తిరుపతి ఏడీ రాజేష్, విజయవాడ కమీషనరేట్ ఆక్వాకల్చర్ డిడి మాధవీలత, ఒంగోలు ఎడీ ఉషా కిరణ్, రాయంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు శ్రీనివాసన్, కెవీ పార్థసారధి, అగ్రికల్చర ఇన్సూరెన్స్ ప్రతినిథులు శివ శంకర మూర్తి తదితరులు ఆక్వా కల్చర్ రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇన్సూరెన్స్ ప్రాధాన్యతలను వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *