పొగాకు రెలుపు, క్యూరింగ్, గ్రెడింగ్లలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలని ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ అన్నారు. ఒంగోలు-2 పరధిలోని సీహెచ్ ఉప్పలపాడు గ్రామంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ మాట్లాడుతూ పొగాకు రేలుపుల తర్వాత ఆకులను నేలపై కాకుండా టార్పాలిన్ పట్టలపై ఉంచి అల్లకం చెయ్యాలని సూచించారు. ఎటువంటి రసాయనాలు వాడకూడదని, శాస్త్రవేత్తల సలహాల మేరకు వాడాలని చెప్పారు. బ్యారన్ కాల్చు సమయంలో అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఇనుప జల్లెడను అమర్చాలని చెప్పారు. ఉష్ణోగ్రత తెలిపే ధర్మామీటర్ తప్పక ఉపయోగించాలని కోరారు. ఐటీసీ ప్రతినిథి యశ్వంత్ మాట్లాడుతూ బ్యారన్ పరిమితి మించి ఎక్కువ కర్రలను ఉపయోగించరాదని చెప్పారు. వెంచెరి పొయ్యి బిగించటం వలన పుల్ల ఖర్చు ఆదా చెయ్యవచ్చని చెప్పారు. వివిధ రెలుపు ఆకులను విడి విడిగా మండెలు చేసుకోవాలని కోరారు. మండె నుండి తేమ బయటకు పోకుండా లేదా బయట తేమ ఆకు పీల్చు కోకుండా వివిధ రకాల టార్పాలిన్ కప్పి ఉంచాలని చెప్పారు. బోర్డు వారి నిబంధనల ప్రకారం ఫారం-3 గ్రెడింగ్ చేసి 150 కేజీల కంటే మించకుండా బెల్లు కట్టవలనని సూచించారు. కురచ పచ్చ ఇతర గ్రేడు, చూరా ఆకులను మేలిమి ఆకులతో కలప రాదని చెప్పారు. గ్రెడింగ్ చేయునప్పుడు అన్య పదార్ధాలు కలవ కుండా వాటిని బుట్టలో వేసుకుని తర్వాత బయట పడవెయ్యాలని చెప్పారు. పొగాకు బేళ్లను తయారు చేయునప్పుడు న్యూస్ పేపర్స్, ప్లాస్టిక్ పేపర్లను వాడకూడదని తెలిపారు. జీపీఐ ప్రతినిథి కళ్యాణ్, పీఎస్ఎస్ఎహెచ్ ప్రతినిథి రామాంజనేయ రెడ్డి, బోర్డు సిబ్బంది. రైతు నాయకులు పాల్గొన్నారు.
