వైఎస్సార్ సీపీ బైక్ ర్యాలీలో మోటారు సైకిల్ అదుపుతప్పి కింద పడిపోయిన తాళ్లూరు మండలం మాధవరం మాజీ సర్పంచ్ కోట పెద్దిరెడ్డిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు వెళ్లి ఆస్పత్రిలో ఉన్న పెద్దిరెడ్డిని పరామర్శించారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచు కోవాలని సూచించారు.
