గుంటి గంగా భవానిలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, దర్శి నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి, నందిని దంపతులు ప్రత్యేక పూజలు- ఘన స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు

జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్సీపీ దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, నందిని దంపతులు కుటుంబ సమేతంగా సందర్శించి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలమ ఈఓ కార్తీక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొసనా గురు బ్రహ్మం ప్రత్యేక స్వాగతం పలికారు. మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావులు, ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, గోళ్లపాటి మోషే, సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందా రెడ్డి, ఎస్సీ సెల్మాజీ అధ్యక్షుడు దేవదానం, చందన, తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టివీ సుబ్బారెడ్డి, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, సర్పంచి మందా శ్యామ్సన్ పలు గ్రామాల సర్పంచిలు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ అభిమానులు ఆలయంలో ఘన స్వాగతం పలికారు. తాళ్లూరు మండలంలో రజానగరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించే నిమిత్తం వెళుతూ మొదటగా గుంటి గంగా భవాని ఆలయంలో బూచేపల్లి కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *