జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా దర్శిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం వారోత్సవాలను నిర్వహించారు. రవాణా శాఖ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు . రహదారి భద్రత- మనందరి బాధ్యత అంటూ పలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, అతి వేగం పెను ప్రమాదమని, వేగం కన్నా ప్రాణం మిన్న అన్న నిజాలను మనసులో గుర్తు పెట్టుకోవాలని సూచించారు . వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపరాదని, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో దర్శి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎం. వి. ఐ) పి.రవికుమార్, కే.రామచంద్రరరావు తదితరులు పాల్గొన్నారు.
