రాష్ట్రానికి మహిళలే మహాశక్తి.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు విడతలుగా రూ.25,571 కోట్ల డ్వాక్రా రుణాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డివ్ మాఫీ చేశారని, జగనన్న మాటిస్తే శిలాశాసనమే’ అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచే పల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో స్థానిక తాలూకా క్లబ్ సమావేశం హాలు ప్రాంగణం లో నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. దర్శి మండలంలో 1266 స్వయం సహాయక సంఘాలకు రూ.10,98,63,000, దర్శి పట్టణంలోని 498 గ్రూపులకు రూ.4,65,18,875 చెక్కులు అందజే శారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడింది నాడు వైఎస్సార్, నేడు వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోవైఎస్సార్ ఆసరా, కాపునేస్తం లాంటి ఎన్నో పథ కాలు ప్రవేశపెట్టారని చెప్పారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ కు దక్కుతుందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించింది కూడా జగనన్న మాత్రమేన న్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి హామీలు అమలు చేసిన నాయకుడు కావాలా..? అబద్ధపు హామీలిచ్చి మేనిఫెస్టోను ఆన్లైన్లో లేకుండా మాయం చేసిన చంద్రబాబు కావాలో నిర్ణయిం చుకోవాలని సూచించారు. గత 20 ఏళ్లుగా బూచే పల్లి కుటుంబం ప్రజా సేవకు అంకితమైందని శివప్రసాద్ మీ సొంత తమ్ముడిలా భావించి ఆదరించాలని మహిళలకు వెంకాయమ్మ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి సమస్యలున్నా దర్శిలోని తన ఇంటికి వచ్చి నేరుగా చెప్పాలని శివప్రసాద్ రెడ్డి సూచించారు. ముందుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ శివప్రసాద్ రెడ్డికి మహిళలు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వైఎ స్సార్ ఆసరా పేరుతో మహిళలు పూలతో ఏర్పాటు చేసిన డిజైన్లను తిలకించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళల కోలాట ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. అధిక సంఖ్యలో హాజరైన మహిళలందరికీ భోజన వసతి కల్పించారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుధాఅచ్చయ్య, ఎంపీడీఓ హను మంతరావు, నగర పంచాయతీ కమిషనర్ మహేష్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రవికుమార్
షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్య విభాగం రాష్ట్ర అధికారప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, గ్రీనరీ అండ్ బ్యూటిఫి కేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, సర్పంచ్ లు కేసరి రాభూపాల్ రెడ్డి, సుబ్బారెడ్డి, రాము, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కేవీ రెడ్డి, కొన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, మజ్జువలి, జగన్, నరసింహారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైయస్సార్ క్రాంతి పదంఏరియా కోఆర్డినేటర్ వసుంధర, సీసీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

