పురాతన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది – వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన చిన్నారులకు, గురువుకు ఘన సన్మానం

పురాతన కళలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు అన్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో మయూరి డాన్స్ అకాడమి ఆధ్వర్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన చిన్నారులు గంగవరపు విజయలక్ష్మి, దుగ్గెంపూడి చైతన్య రెడ్డి, గాయిత్రి, తన్మయి శ్రీ, గురువు శివశంకర్ మాస్టర్ కి ఘన సన్మానం నిర్వహించారు. కళలు మన సంస్కృతిలో భాగమే అని వక్తలు అన్నారు. అనంతరం ప్రదర్శించిన భరత నాట్యం, శివతాండవం, నృత్య రూపకాలు ఎంతో గానో ఆకర్షించాయి. చిన్నారులలో కళలను పొత్సహించటానికి మయూరి డ్యాన్స్ అకాడమి అభివృద్ధికి శివశంకర్ మాస్టార్ కు గ్రామంలోని అమెరికన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ పులి శిరీష పదివేల రూపాయలు అందచేసారు. మాజీ సొసైటీ అధ్యక్షుడు, గ్రామ ఉప సర్పంచి పులి ప్రసాద రెడ్డి, ఉపాధ్యాయులు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, ఎపీఎస్ ప్రిన్సిపాల్ రవికుమార్, పిరమిడ్ గురువు విజయలక్ష్మి, పోలం రెడ్డి రామచంద్రా రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *