అట్టహాసంగా ‘ఉగ్ర’ జన్మదిన వేడుకలు

కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను గురువారం కనిగిరిలో టిడిపి శ్రేణులు అత్యంత వేడుకగా నిర్వహించారు. డాక్టర్ ఉగ్ర 51వ జన్మదిన సందర్భంగా 51 కేజీల కేక్ కట్ చేసి ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయం శక్తితో బతికేందుకు 40 మంది పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు తోపుడు బండ్లతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో టీడీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుమహిళలు బధిరుల పాఠశాలలో కుర్చీలు పంపిణీ చేశారు. బెంగుళూరులో బెంగుళూరు టీడీపీ ఫోరమ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగ్ర జన్మదిన వేడుకలు నిర్వహిం చారు. గుంటూరు, ఢిల్లీ, హైదరాబాద్, గుజ రాత్, విజయవాడలలోనూ టీడీపీ నాయకులు వేడుకలు నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఉగ్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి డాక్టర్ ఉగ్రకు తినిపించి.. శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు, అద్దంకిఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే స్వామి, మాజీ ఎమ్మెల్సీ రాజు ఉన్నారు. తిరుమల తిరుపతిలో టిడిపి శ్రేణులు ఉగ్రనరసింహారెడ్డి ఫొటోతో అలిపిరి మార్గంలో మెట్లపై కొండ ఎక్కి పూజలు నిర్వహించారు.
కనిగిరిలో జరిగిన వేడుకలలో కనిగిరి పట్టణ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ పిచ్చల శ్రీనివాసరెడ్డి, టిడిపి నాయకులు రాచమల్ల శ్రీనివాసరెడ్డి, ముచ్చుమారి చెంచిరెడ్డి, బాలు ఓబుల్ రెడ్డి, షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, గుడిపాటి ఖాదర్, బ్నుల్ల బాల బాబు, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, నంబుల కొండయ్య, సైకం మాలకొండరెడ్డి, నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి, నారపరెడ్డి వెంకటరెడ్డి, చింతలపూడి తిరుపాలు, ఈదర రవి కుమార్, పాలూరి సత్యం, ఆర్వి నారా యణ, కరణం అరుణమ్మ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పామూరులో
ఉగ్ర నరసింహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండలాల్లోని ప్రతి గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. టిడిపి మండల అధ్యక్షులు పువ్వాడి వెంక టేశ్వర్లు కేక్ కట్ చేశారు. వికలాంగులకు మూడు చక్రాల బండ్లు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో ఎం రమణయ్య, షేక్ రహంతుల్లా, షేక్ మౌలాలి, శంకర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *