తాళ్లూరు మండలపరిధిలోని పంటలు సాగు చేయుచున్న కౌలు రైతులకు, ఋణాలు మంజూరు విషయంలో బ్యాంకర్లు చొరవచూపాలని, వారి సాగు ఖర్చులను అధిగమించడానికి ఆర్థిక తోడ్పాటు అందించాలని తాళ్లూరు మండల వ్యవసాయఅధికారి ప్రసాదరావు తెలిపారు. తూర్పు గంగవరంలోని ఆంధ్రప్రగతి గ్రామీ బ్యాంకునుసందర్శించి, బ్రాంచి మేనేజర్ మహేష్‌తో కౌలు రైతులకు రుణ సదుపాయంకల్పించాలని, అదేవిధింగా మండలంలోని బొద్దుకూరపాడు ఏపి.జి.బి,తూర్పుగంగవరం యూనియన్ బ్యాంక్, తాళ్ళూరు కెనరా బ్యాంకు మేనేజర్లును కోరారు. కార్యక్రమంలో వి.ఎ. వెంకట సుమ, గంగమ్మ, కౌలురైతు గ్రూపు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
