బర్డ్ ఫ్లూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి -జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ కే బేబిరాణి

బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల కోళ్లఫాం యజమానులు, నాటు కోళ్ల పెంపకందారులు, పశువైద్యులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ కే బేబిరాణి కోరారు. వెల్లంపల్లి వద్ద సత్యనారాయణ రెడ్డి కోళ్ల ఫాంను శుక్రవారం సందర్శించి వ్యాధి పట్ల అవ గాహన, ముందస్తు జాగ్రత్తల గురించి చెప్పారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో కోళ్లలో వచ్చిన బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావటం తో జిల్లాలోని కోళ్ల పెంపకందారులను అప్ర మత్తం చేసినట్లు చెప్పారు. జిల్లాలో 8,33,500 కోళ్లు రైతుల వద్ద, ఫాం లలో ఉన్నట్లు చెప్పారు. గాలి ద్వారా వేగంగా వ్యాపించే ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఎక్కువ సం ఖ్యలో కోళ్లు మరణిస్తే స్థానిక పశువైద్యాధికారి దృ ష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ వ్యాధి కోళ్లకు, వాటి ద్వారా మనుషులకు సోకి ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలు కలగచేస్తాయని చెప్పారు. కోళ్ల ఫాం యజమానులు పక్క జిల్లాల నుంచి కోళ్లను కొనుగోలు చేయటం, కోళ్ల దాణాను కొనుగోలు చేయటం నిషేధించినట్లు చెప్పారు. ఆమె వెంట జిల్లా వ్యాధి నిర్ధారణశాల ఉప సంచాలకు డాక్టర్ ఎస్ కాలేషా ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *