రోటరీ సేవలు అభినందనీయం -వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన వైఎస్ఆర్సిపి దర్శి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి

రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి మండలంలోని కాశీనాయన వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు దుప్పట్లు, చాపలు, బియ్యం పంపిణీ శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ . దాతృత్వంతో పేదలకు సాయం చేయడం అభినందనీయమని చెప్పారు. తాము చేసిన సాయంతో లేని వారు ఎంతో సంతోషంతో ఉంటారని, అదే మన తరతరా లకు పుణ్య ఫలమని చెప్పారు. రోటరీ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షుడు అలవల అంజిరెడ్డి, కార్యదర్శి మార్తల భాస్కర్ రెడ్డి, కోశాధికారి ఎదురు వెంకట నారాయణ రెడ్డి, డిస్ట్రిక్ట్ మెంబర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం భాషా, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, చెమిరెడ్డి రాజా రెడ్డి, కేవీరెడ్డి, కర్ణా భాస్కర్ రెడ్డి, ఏరువ లక్ష్మీ నారాయణరెడ్డి, శ్రీను, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *