జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రభావం సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందని ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో కూడ నూతన కేసులు నమోదు కాలేదని జిల్లా పశువైధ్యాధికారి డాక్టర్ కె బేబి రాణి తెలిపారు. జిల్లాలో ముందస్తు జాగ్రత్తగా పలు కోళ్ల ఫాంలు పరిశీలించి తగిన సూచనలు చేసామని చెప్పారు. జిల్లాలో 101 ర్యాపిడ్ రప్పాన్స్ టీమ్స్ 740 పిపిఈ కిట్స్ను అందుబాటులో ఉంచి నిరంతరం అన్ని కోళ్ల ఫాం లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడ కోడి మాసం, కోడి గ్రుడ్లను నిరభ్యంతరంగా వాడుకోవచ్చని చెప్పారు. ఎటువంటి వదంతులు నమ్మకుండా పౌష్టికాహారం అయినట్లు వంటి కోడి మాంసం, గ్రుడ్లను వాడుకోవచ్చని చెప్పారు.
