దర్శి నియోజకవర్గంలోని వైద్యులందరూ ఎన్ని కల్లో సహకరించి వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషి చేయాలని దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. దర్శి పట్టణంలోని ప్రధాన ఆస్పత్రులు, ఇతర వైద్య వృత్తిలో ఉన్న డాక్ట ర్లను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, వైఎస్ఆర్సిపి సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లు మంగళవారం కలిసి మాట్లాడారు. వైద్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లను ఘనంగా సత్కరించారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తిలో లేకున్నా వైద్యంపై ప్రేమతో తానూ ఎంబీబీఎస్ చదివానని చెప్పారు.
తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి వారసత్వంగా రాజకీయాలు, వ్యాపారాల్లోకి రావాల్సి వచ్చింద న్నారు. మీ తోటి డాక్టర్ కు అందరూ సపోర్ట్ చేసి ఓట్లేసి తమ సిబ్బందితో ఫ్యాన్ గుర్తుపై ఓట్లేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కలిసిన వారిలో డాక్టర్లు కోటిరెడ్డి, కృష్ణారెడ్డి, బాలయ్య, విక్రమ్, ఝాన్సీ, ప్రభావతి, సోనార్ బాబు, దుర్గా రావు, రాజేష్, రామాంజనేయులు, ఆనంద్ బాబు, హర్ష ఉన్నారు. వైద్యవిభాగం అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, వ్యవసాయ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.





సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన డాక్టర్ బూచేపల్లి…
నియోజకవర్గంలో పలు మండలాలకు చెందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అందజేశారు.ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామా నికి చెందిన నారాయణకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్షా ఇరవై వేల రూపాయల చెక్కును దర్శి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మంగళవారం అంద జేశారు. గ్రామానికి చెందిన మీనిగ నాగేంద్రం ఇటీవల మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడే వారికి జగనన్న ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని శివప్రసాదరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గూడాల లిం గారెడ్డి ఉన్నా రు.
దర్శి మండలం లో…..
దర్శిమండలంలోని శామంతపూడి గ్రామానికి చెందిన పోకిరి సుబ్బులుకు లక్షా ఇరవై వేల రూపాయలు, మోటుపల్లి గ్రామానికి చెందిన గుం టక రామసుబ్బమ్మకు రూ.60 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచే పల్లి శివప్రసాద్ రెడ్డి అందజేశారు.
