గార్వి షరీఫ్ ఫాతియా కార్యక్రమం లో పాల్గొన్న తలసాని.

రామ్ గోపాల్ పేట డివిజన్ పరిధిలోని సిటీలైట్ చౌరస్తా వద్ద గల గౌసేపాక్ దర్గాలో ఆదివారం నిర్వహించిన గార్వి షరీఫ్ ఫాతియా కార్యక్రమంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్ధనల అనంతరం నిర్వహకులు ఫకీర్, జాకీర్, అమిత్, అలీ లు తలసాని నీ సన్మానించారు. ఎమ్మెల్యే వెంట ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీ ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు, ప్రేమ్ కుమార్, వినయ్ కుమార్, గౌరీశంకర్, సత్యనారాయణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *